ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా మన తెలుగోడు
- October 29, 2017పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల బ్యాడ్మింటన్ ఫైనల్లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ మరోసారి తన సత్తా చాటాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో 40వ ర్యాంకర్ కెంటా నిషిమోటో(జపాన్)పై వరుస సెట్లలో విజయం సాధించి కెరీర్లో ఐదో సూపర్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై కిదాంబి పైచేయి సాధిస్తూ వచ్చాడు. 21-14, 21-13 తేడాతో రెండు సెట్లు గెలుచుకొని విజయకేతనం ఎగురవేశాడు.
ఈ గెలుపుతో సీజన్లో వరుసగా నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలుచుకున్నతొలి భారత ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. గత ఆదివారం డెన్మార్క్ ఓపెన్ టైటిల్ నెగ్గిన శ్రీకాంత్ తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కూడా కైవసం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్‌ను సెమీస్‌లో ఓడించి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్