'గిగా ప్రాజెక్టు'లతో సౌదీ అరేబియా ప్రభుత్వం పెట్టుబడుల వేట

- October 30, 2017 , by Maagulf
'గిగా ప్రాజెక్టు'లతో సౌదీ అరేబియా ప్రభుత్వం పెట్టుబడుల వేట

హోలోగ్రాఫిక్‌ లయన్‌ నుండి మాట్లాడే రోబోలు, ఫ్లయింగ్‌ టాక్సీల వంటి హైటెక్‌ గిగా ప్రాజెక్టులతో సౌదీ అరేబియా ప్రభుత్వం పెట్టుబడుల వేటకు సిద్ధమయింది. అయితే ఇంథన చమురు అత్యంత చౌక ధరకు లభిస్తున్న ప్రస్తుత సమయంలో ఈ ప్రాజెక్టుల సాధ్యా సాధ్యాలే ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. పశ్చి మాసియాలో 'సిలికాన్‌ వ్యాలీ'ని పోలిన నియోమ్‌ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సౌదీ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. ఇందులో భాగంగానే రియాద్‌ నగరంలో వాల్ట్‌ డిస్నీని తలదన్నె వినోద నగరం, రెడ్‌సీ ప్రాజెక్టు పేరుతో రిసార్టుల నిర్మాణం వంటి వాటిని తెరపైకి తెచ్చారు. సౌదీ అరేబియాను ప్రపంచ దేశాల వ్యాపార గమ్యంగా మార్చే లక్ష్యంతో 'దావోస్‌ ఇన్‌ ది డిజెర్ట్‌' పేరుతో ఈ వారంలో జరుగనున్న భావి పెట్టుబడుల సేకరణ ప్రయత్నా (ఎఫ్‌ఐఐ)నికి సౌదీ ప్రభుత్వం తెర తీసింది. అయి తే ప్రధానంగా చమురు ఆదాయంపైనే ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ వున్న సౌదీ ప్రయత్నాలు ఎంతవరకూ ఆచరణ సాధ్య మన్న అంశం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ ప్రయత్నం అత్యుత్సాహంతో కూడినదని, దీని అమలులో అనేక ప్రమాదాలు పొంచి వున్నాయని, ఇది ఉపాధి, ఉద్యోగా వకాశాల కల్పనకు ఏ మత్రం సహకరించదని నియోమ్‌ ప్రాజెక్టుపై ప్రముఖ విశ్లేషణా సంస్థ యూరాసియా గ్రూప్‌కు చెందిన విశ్లేషకులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలు, పెట్టుబడి ప్రణాళికలను ప్రకటిస్తూండే సౌదీ ప్రభుత్వ ధోరణి దాని ధైర్య, సాహసాలను ప్రపంచానికి వెల్లడిస్తున్నప్పటికీ, ఒకేసారి అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమా లను కొనసాగించే సత్తా ఆ ప్రభుత్వానికి లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం చమురు ధరలు నేలబారు చూపులు చూస్తున్న సమయంలో చమురు విక్రయాల ఆదాయంపైనే ఆధారపడుతున్న సౌదీ ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రాజెక్టులు పెను భారాన్నే మోపనున్నాయని వారు చెబుతున్నారు. ఇన్ని ప్రాజెక్టులు ఇప్పటి వరకూ ఒకే సారి ప్రారంభించిన దాఖలాలు లేవు. వీటిని ఏ విధంగా అమలు చేస్తారో వేచి చూడాల్సిందేనని రియాద్‌లోని అమెరి కన్‌ బిజినెస్‌ గ్రూప్‌కు చెందిన అలన్‌ లోవే అభిప్రాయ పడ్డారు.
సరికొత్త భవిత 
'విజన్‌ 2030' పేరుతో సంస్కరణ అమలుకు తెరతీసిన సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆలోచనల నుండి రూపుదిద్దుకున్నదే ఈ నియోమ్‌ ప్రాజెక్టు. దేశంలో తాను కలలు కంటున్న మార్పును చూపేందుకు ఆయన ఒక చేతిలో పాత నోకియా ఫోన్‌ను, మరో చేత అత్యాధునిక ఐఫోన్‌ను చూపుతూ తన స్వప్నాన్ని పెట్టుబడిదారులకు వివరిస్తూ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తన ప్రణాళికల అమలుకు ఆయన యువత నుండి మద్దతు కోరుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com