హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ క్రికెటర్‌ ఎంవీ శ్రీధర్‌ కన్నుమూత

- October 30, 2017 , by Maagulf
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ క్రికెటర్‌ ఎంవీ శ్రీధర్‌ కన్నుమూత

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ క్రికెటర్‌ ఎంవీ శ్రీధర్‌ (51) కన్నుమూశారు. నగరంలోని స్టార్‌ ఆస్పత్రిలో సోమవారం ఆయన గుండెపోటుతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని స్వగృహానికి తరలించారు. హైదరాబాద్‌ నుంచి రంజీ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించిన శ్రీధర్‌.. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం కార్యదర్శిగా పనిచేశారు. బీసీసీఐ మేనేజర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టుకు మేనేజర్‌గా శ్రీధర్‌ పనిచేశారు. 1988-1999 మధ్యకాలంలో ఆయన 97 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచులాడి 6,701 పరుగులు చేశారు. 21 శతకాలు, 27 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత పరుగులు 366. ఆయన మృతిపట్ల హైదరాబాద్‌, బీసీసీఐ క్రికెట్‌ పెద్దలు సంతాపం ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com