యూఏఈలో తగ్గనున్న పెట్రోల్‌ ధరలు

- October 30, 2017 , by Maagulf
యూఏఈలో తగ్గనున్న పెట్రోల్‌ ధరలు

యూఏఈ వాహనదారులకు శుభవార్త చెప్పింది. నవంబర్‌లో పెట్రో ధరలు తగ్గనున్నాయి. 4 శాతం మేర ధరలు తగ్గనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్‌ ఎనర్జీ వర్గాలు వెల్లడించాయి. గడచిన కొన్ని నెలలుగా యూఏఈలో పెట్రోల్‌ ధరలు పెరుగుతూ వచ్చాయి. అక్టోబర్‌లో 91 అన్‌లెడెడ్‌ పెట్రోల్‌ ధరలు 1.94 దిర్హామ్‌లు ఉండగా, నవంబర్‌లో ఈ ధర 1.85గా ఉండనుంది. ఇది 4.6 శాతం తగ్గింపు. 95 ఆక్టేన్‌ పెట్రోల్‌ 4.4 శాతం తగ్గనుంది. దీని ధర 1.92 కానుంది. 98 ఆక్టేన్‌ పెట్రోల్‌ ధర 2.03 అవనుంది. ఈ ఏడాదిలో అత్యధికంగా పెట్రోల్‌ ధరలు అక్టోబర్‌లో నమోదయ్యాయి. అయితే డీజిల్‌ ధరలు మాత్రం 1 ఫిల్‌ పెరిగి 2.11కి చేరుకోనుంది. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com