మైనర్‌తో పెళ్ళి: ఇండియలో బహ్రెయినీ అరెస్ట్‌

- October 30, 2017 , by Maagulf
మైనర్‌తో పెళ్ళి: ఇండియలో బహ్రెయినీ అరెస్ట్‌

హైదరాబాద్‌: బహ్రెయినీ జాతీయుడొకరు ఇండియాలో అక్రమంగా మైనర్‌ బాలికని వివాహం చేసుకుంటుండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గతవారం బహ్రెయిన్‌ నుంచి వచ్చిన వ్యక్తి, తలాబ్‌కట్టకి చెందిన ఓ బాలికను వివాహం చేసుకున్నాడు. ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలోని పోలీస్‌ టీమ్‌, నిందితుడి మూమెంట్స్‌ని ఎప్పటికప్పుడు పరిశీలించి, వ్యూహాత్మకంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మ్యారేజ్‌ సర్టిఫికెట్‌, కొంత డబ్బు, పాస్‌పోర్ట్‌ ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా తెరపైకొస్తున్నాయి. 16 ఏళ్ళ బాలికల్ని 60 ఏళ్ళకు పైబడిన వృద్ధులు పెళ్ళి చేసుకుని జిసిసి దేశాలకు తీసుకెళుతున్నారు. వారిలో చాలామంది తీవ్ర హింసల్ని ఎదుర్కొంటున్నట్లు పోలీసులు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com