గల్ఫ్ సహకార మండలిలో కతార్ సభ్యత్వం రద్దు
- October 30, 2017
గల్ఫ్ సహకార మండలి (జిసిసి)లో కతార్ సభ్యత్వాన్ని రద్దు చేయా లని బెహ్రెయిన్ డిమాండ్ చేసింది. కతార్ తన వైఖరిని మార్చుకోకపోతే త్వరలో జరిగే జిసిసి భేటీకి తాము హాజరు కాబోమని బెహ్రెయిన్ విదేశాంగ మంత్రి ఖాలిద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా ట్విట్టర్లో స్పష్టంచేశారు. కతార్ తన వైఖరి మార్చు కోకుండా రానున్న జిసిసి సమావేశం వరకూ కాలక్షేపం చేద్దామనుకుంటే అది పొరపాటే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము ఈ భేటీకి హాజరు కాబోమని ఆయన తేల్చిచెప్పారు. జిసిసి యధాతథంగా కొనసా గాలంటే కతార్ సభ్యత్వాన్ని రద్దు చేయటమే సరైన మార్గమని, అలా జరగకపోతే తాము మండలి నుండి తప్పుకుంటామని ఆయన హెచ్చరించారు. బెహ్రెయిన్తో పాటు సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు కతార్తో దౌ త్య, రవాణా, వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!