36 మిలియన్ దిర్హామ్‌ల విలువైన డూప్లికేట్ కార్ పార్ట్స్ పట్టివేత
- November 01, 2017
యూఏఈ వ్యాప్తంగా గడచిన 9 నెలల్లో నిర్వహించిన 20 తనిఖీల్లో 36 మిలియన్ దిర్హామ్‌ల విలువైన డూప్లికేట్ కార్ పార్ట్స్‌ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అల్ ఫుత్తైమ్ మోటార్స్ సహకారంతో వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఈ తనిఖీల్ని నిర&్వహించాయి. డూప్లికేట్ కార్ పార్ట్స్ కారణంగా కార్లకు ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ నేపథ్యంలో 240 మంది ప్రభుత్వ ఉద్యోగులకు దుబాయ్, అబుదాబీల్లో శిక్షణ ఇప్పించారు. అనంతరం వారిని రంగంలోకి దించి, డూప్లికేట్లకు అడ్డుకట్ట వేయగలిగామని అధికారులు చెప్పారు. దుబాయ్ పోలీసులతో కలిసి అధికారులు, రెండు ఎగ్జిబిషన్స్ కూడా నిర్వహించారు. షాపింగ్ మాల్స్‌లో తొలి క్వార్టర్లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్స్ ద్వారా వినియోగదారులకు డూప్లికేట్ కార్ పార్ట్స్‌పై అవగాహన కల్పించడం జరిగింది. అధీకృత డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా మాత్రమే స్పేర్ పార్ట్స్ కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!