తీవ్రవాద నేరం: 10 మందికి జీవిత ఖైదు

- November 01, 2017 , by Maagulf
తీవ్రవాద నేరం: 10 మందికి జీవిత ఖైదు

మనామా: హై క్రిమినల్‌ కోర్టు, 10 మందికి జీవిత శిక్షను విధించింది. అలాగే వారి పౌరసత్వాన్ని కూడా రద్దు చేయాలని ఆదేశించింది. తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేసి, దాడులకు పాల్పడిన నేరానికిగాను ఈ శిక్షలు ఖరారు చేసినట్లు చీఫ్‌ ఆఫ్‌ టెర్రర్‌ క్రైమ్‌ ప్రాసిక్యూషన్‌ అహ్మద్‌ అల్‌ హమ్మాది చెప్పారు. తొమ్మిది మంది నిందితులకు అదనంగా 100 బహ్రెయినీ దినార్స్‌ జరీమానాతోపాటుగా, నెల రోజుల జైలు శిక్షను అక్రమంగా కత్తిని కలిగి ఉన్న నేరానికిగాను విధించారు. నిందితులు ఆయుధాల్ని అలాగే బాంబుల్ని ఉపయోగించడంలో శిక్షణ పొందారు. బహ్రెయిన్‌ కింగ్‌డమ్‌లో విధ్వంసాలు సృష్టించడమే లక్ష్యంగా వీరు తీవ్రవాద సంస్థను నెలకొల్పారు. ఓ వ్యక్తి ఇరాక్‌కి వెళ్ళి అక్కడే శిక్షణ పొంది, పది మంది బహ్రెయినీలను రిక్రూట్‌ చేసి, ఇరాన్‌ మరియు ఇరాక్‌కి పంపాడు. అక్కడ వారికి శిక్షణ ఇప్పించిన ఆ వ్యక్తి అక్కడే మృతి చెందాడు. మిగతావారంతా బహ్రెయిన్‌కి తిరిగి వచ్చి తీవ్రవాద కార్యకలాపాల్లో జోరు పెంచారు. వీరి అరెస్ట్‌ సందర్భంగా పలు ఆయుధాలు, పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com