30 ఏళ్ళ లోపు గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లకు కువైట్ లో ఉద్యోగం లేదు
- November 04, 2017
కువైట్ : ' చదువుకు లేత ....పెళ్ళికి ముదురు ' వ్యక్తులు కావాలన్నట్లు... ఉద్యోగంకు ముదురు నిరుద్యోగులు కావాలనే పంధాని కువైట్ ప్రభుత్వం అమలుచేయనుంది. 30 ఏళ్ళ లోపు వయస్సు ఉన్న డిగ్రీలు మరియు డిప్లొమాలు వ్యక్తుల నియామకాన్ని నిలిపివేయాలని ది మాన్పవర్ పబ్లిక్ అథారిటీ (పి ఎ ఎం ) ఒక నిర్ణయం శనివారం జారీ చేసింది. ఈ నిర్ణయం 2018 నుండి ప్రారంభమౌతుంది. ఈ వయస్సులో ఉన్న 30 ఏళ్ళ వయస్సు లోపు యువకులు తమ కువైట్ దేశాన్ని విడిచిపెడితే తప్ప వారి సర్టిఫికేట్లను అందచేయలేమని ఈ నిర్ణయం పేర్కొంది. వృత్తిపరమైన వర్గాల్లో తక్కువ వయస్సు గల ఏ కువైటీవాసులను నియమించలేదని పేర్కొంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో నిర్వహించబడే కొన్ని వృత్తులలో మరియు చిన్న కార్మికుల ఉద్యోగాలలో వేరేవారితో భర్తీ చేయడం వంటి చర్యలను కూడా అమలు చేస్తుంది. భద్రతా దళాలకు కాంట్రాక్టుల శాతాన్ని తగ్గించడానికి మరియు పారిశ్యుద్ద కార్మికుల సంఖ్యను తగ్గించాలని మంత్రిత్వ శాఖ కోరుతుంది. ప్రభుత్వ ఒప్పందాల సంఖ్య 2,274 గా ఉన్నట్లు అథారిటీ సూచించింది. అయితే ఆ కాంట్రాక్టుల్లో నమోదైన కార్మికుల సంఖ్య 447,077 మంది కార్మికులు కొనసాగుతున్నట్లు తెలియచేసింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!