వియత్నాంలో భారీ తుఫాన్, 15 మంది మృతి
- November 04, 2017_1509857377.jpg)
అక్టోబరు నెలలో వియత్నాంలో సంభవించిన తుఫాను నుంచి కోలుకోకముందే శనివారం మరో తుఫాను విరుచుకుపడింది. దీంతో 15 మంది మృతిచెందగా, నలుగురు గల్లంతయ్యారు. ఈ తుఫాను ప్రభావంతో ఖాన్ హూవా రాష్ట్రం బాగా దెబ్బతిన్నది. ఈ రాష్ట్రంలో 14 మంది చనిపోయారు. 302 ఇండ్లు నేలమట్టమయ్యాయి. పంట పొలాలు బాగా దెబ్బతిన్నాయి. బిన్‌దిన్, ఫూ యెన్ రాష్ర్టాలు సైతం తుఫాను ప్రభావానికి గురయ్యాయి. ఈ రాష్ర్టాల్లో ఒకరు మృతిచెందగా, నలుగురు గల్లంత య్యారు. తుఫాను నేపథ్యంలో అధికారులు దాదాపు 35 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాఠశాల విద్యార్థులు ఇంటి నుంచి బయటికి రావద్దని సూచించారు. గత నెలలో తుఫాను వల్ల దాదాపు 75 మంది చనిపోగా, 28 మంది గల్లంతయ్యారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!