ఫిలిఫైన్స్‌కు చెందిన మహిళపై లిఫ్ట్ లో అత్యాచారయత్నం

- November 05, 2017 , by Maagulf
ఫిలిఫైన్స్‌కు చెందిన మహిళపై లిఫ్ట్ లో అత్యాచారయత్నం

సౌదీఅరేబియా : మహిళలకు ఇంటా బైటా రక్షణ లేదనడానికి ఈ వార్త ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఆఖరుకి అంతస్తులు ఎక్కి దిగే లిఫ్ట్ లలో సైతం కొందరు మగవాళ్ల వేధింపులు తప్పడం లేదు.  ఫిలిఫైన్స్‌కు చెందిన ఒక మహిళ ఒంటరిగా లిఫ్ట్ ఎక్కింది. అది గమనించిన ఒక వ్యక్తి వెంటనే ఆ లిఫ్ట్ ఎక్కాడు. ఆమెను అసభ్యకరంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. వెంటనే ప్రతిఘటించి  ఆమె అతడి చెంప చెల్లుమనిపించింది. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చేరుకోవడం ఆలస్యమయింది. దాంతో లిఫ్ట్ ఎక్కాలనుకున్నవారు లిఫ్ట్ బాయ్‌‌ని పిలిచారు. అప్పటికే ఆమె పోలీసులకు మొబైల్ ద్వారా సమాచార మందించింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిద్దరూ ఒకే బిల్డింగ్‌లో నివాసముంటున్నారని పోలీసులు తెలిపారు. అఫ్ఘనిస్తాన్‌రకు చెందిన వ్యక్తి(45) ఈ మధ్యనే పర్యాటక  వీసాపై దుబాయ్ వచ్చాడని పోలీసులు తెలిపారు. నైఫ్ అనే ప్రాంతంలో తన స్నేహితుడి దగ్గరే అతడు ఉంటున్నాడని అదే బిల్డింగ్‌లో ఫిలిఫైన్స్‌కు చెందిన మహిళ నివాసముంటోంది. ఆమె ప్రయివేటు సంస్థలో క్లర్క్‌గా పనిచేస్తోందని పోలీసులు చెబుతున్నారు. అయితే కొంతకాలంగా నిందితుడు తన కోర్కెను తీర్చాలని  ఆమె వెంటపడుతున్నాడని..లిఫ్ట్ లో వంటరిగా కనబడటంతో ఆమెపై నిందితుడు  లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించాడని వారన్నారు. అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com