హాలోవెన్ డే రోజున రిలీజైన దెయ్యం సినిమా నెక్స్ట్ నువ్వే ...
- November 05, 2017కంటెంట్ కు సిచ్యువేషన్స్ కూడా కరెక్ట్ గా సింక్ అయితే సినిమాలకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. హర్రర్ కామిక్ గా తెరకెక్కిన నెక్ట్స్ నువ్వే సినిమాకు కూడా ఇలాగే హాలోవెన్ డే ప్లస్ అయ్యింది. దెయ్యాల కథకు, దెయ్యాల ఫెస్టివల్ తో ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోది నెక్ట్స్ నువ్వే.
నెక్ట్స్ నువ్వే సినిమాకు ఓవర్సీస్ లో హాలోవెన్ డే మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెడుతోంది. ప్రభాకర్ దర్శకత్వంలో ఆది సాయికుమార్, వైభవి, రష్మి, లీడ్ రోల్స్ లో రూపొందిన ఈసినిమా హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. వి4 బ్యానర్ లో పాజిటివ్ బజ్ తో వచ్చిన నెక్ట్స్ నువ్వే అదే బజ్ ను కంటిన్యూ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హాలోవెన్ డే సీజన్ నడుస్తోన్న యు.ఎస్ లో ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈమంథ్ స్టార్టింగ్ లోనే హాలోవెన్ డే రావడం, అదే టైంలో సినిమా కూడా రిలీజ్ కావడంతో నెక్ట్స్ నువ్వేకు ఈ సీజన్ ప్లస్ అయ్యింది. దీంతో సినిమాకు ఫ్లోటింగ్ పెరుగుతోందట. కలెక్షన్లు బావున్నాయట. సో నెక్ట్స్ నువ్వేతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రభాకర్ కు ఈసినిమా మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తోందని చెప్పొచ్చు. లోకల్ మార్కెట్ లో కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో టీం సెలబ్రేషన్ మూడ్ లో ఉంది.
తాజా వార్తలు
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..