బహ్రెయిన్ లో ప్రవేశించాలంటే 3 గంటల పాటు రహదారులపై వేచి ఉండాలి
- November 05, 2017
దమ్మాం: ' కర్ణుడు చావుకి .వేయి కారణాలైతే....బహ్రెయిన్ లో ప్రవేశించాలనుకొనే ప్రయాణికులను మూడు కారణాలు ఈ వారాంతంలో ముప్పుతిప్పలు పెట్టాయి. దీంతో తీవ్రమైన రద్దీ ఏర్పడి 3 గంటల పాటు రహదారులపై నిరీక్షించాల్సివచ్చింది. సౌదీ అరేబియా మరియు బహ్రెయిన్లను కలిపే కింగ్ ఫాహ్డ్ కాజ్వే బ్రిడ్జ్ వద్ద గురువారం మరియు శుక్రవారం ట్రాఫిక్ రద్దీ తో ఎక్కువ దూరం వరకు వ్యాపించింది. తూర్పు ప్రావిన్స్ లో పాస్పోర్ట్ మరియు కస్టమ్స్ శాఖ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. బహ్రెయిన్ లో ప్రవేశించాలంటే అధికారుల అనుమతి కోసం పత్రాల పరిశీలన గురువారం ఉదయం11 గంటలకు ప్రారంభమై రాత్రి బాగా పొద్దుపోయేవరకు కొనసాగింది. ప్రయాణికుల అనుమతి ప్రక్రియ మూడు గంటల కంటే ఎక్కువ సమయం పట్టింది. అత్యధిక శాతం మంది ప్రయాణీకులు పెద్ద సంఖ్యలో వాహనాలలో చిక్కుకున్నందువల్ల తిరిగి ఈ మార్గంలో ప్రయాణించలేకపోయారు. దాంతో ఎక్కువ గంటలు వాహనాలలో వేచి ఉండవలసి వచ్చిందని పలువురు వాపోయారు."గత గురువారం కింగ్ ఫహద్ కాజ్వే బ్రిడ్జ్ వద్ద ఇదే పరిస్థితి ఎదురైంది. ట్రాఫిక్ రద్దీ అక్కడ ఏర్పడినపుడు కస్టమ్స్ వారి సిబ్బందిని సమీకరించారు, రెండు-రోజుల ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో తర్వాత వారం అక్కడ ఎదురయ్యే పరిస్థితిని అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారు. ట్రాఫిక్ రద్దీ ఏర్పడటానికి ఇక్కడ మూడు ప్రధాన కారణాలున్నాయని పేర్కొన్నారు. ప్రైవేటు రంగంలో పలువురు ఉద్యోగులకు జీతాలు ఇచ్చే ప్రక్రియ సైతం ఈ వారాంతంలో జరిగింది. అదేవిధంగా బహ్రెయిన్ లో అతిపెద్ద షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం ఇటీవల ప్రారంభించబడింది. అలాగే బహ్రెయిన్ పాస్పోర్ట్ మరియు కస్టమ్స్ శాఖ ప్రయాణికుల అనుమతి విధానాలను పూర్తి చేయడానికి కొత్త వ్యవస్థను ఉపయోగించడం ప్రారంభించింది. ట్రాఫిక్ లో చిక్కుకొన్న ప్రయాణికుల ఫోటోలు మరియు వీడియో ఫుటేజ్ లను మరియు ట్రాఫిక్ రద్దీ అనేక కిలోమీటర్ల విస్తరించిన ట్విటర్, ఫేస్బుక్ వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాలలో పలువురు వినియోగదారులకు పోస్ట్ చేయబడ్డాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!