సౌదీ అరేబియాకి యూఏఈ అండగా ఉంటుంది

- November 05, 2017 , by Maagulf
సౌదీ అరేబియాకి యూఏఈ అండగా ఉంటుంది

అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌, యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ సుప్రీమ్‌ కమాండర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ మాట్లాడుతూ, సౌదీ అరేబియాకి అన్ని విధాలా అండగా ఉంటామని, ఆ దేశంతో కలిసి పనిచేస్తామని చెప్పారు. రియాద్‌ వైపుగా తీవ్రవాదులు మిస్సైల్‌ని సంధించడాన్ని షేక్‌ మొహమ్మద్‌ తీవ్రంగా ఖండించారు. ఈ మిస్సైల్‌ని సౌదీ అరేబియా ఫోర్సెస్‌ కూల్చివేసిన సంగతి తెలిసినదే. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ అవలేదు. రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం టార్గెట్‌గా మిస్సైల్‌ని యెమెన్‌ నుంచి సంధించినట్లు సౌదీ అరేబియా గుర్తించి, దాన్ని ఇంటర్సెప్టర్స్‌ ద్వారా కూల్చేసింది. సౌదీ అరేబియాపై జరిగిన దాడిని తమపై జరిగిన దాడిగా భావిస్తామని యూఏఈ తరఫున షేక్‌ మొహమ్మద్‌ చెప్పారు. తమ సోదరులకు పూర్తి సహకారం అందిస్తామని, సౌదీ కింగ్‌ సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌, సౌదీ అరేబియా భద్రత విషయంలో రాజీ పడబోరని, దేశ ప్రజలకు ఆయన నుంచి సంపూర్ణ భరోసా ఎప్పటికీ ఉంటుందని ఆయన కోరితే సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉంటామని షేక్‌ మొహమ్మద్‌ వివరించారు. తీవ్రవాదుల్ని సంపూర్ణంగా ఏరివేయాల్సిందేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ అరాచక శక్తుల ఆటలు సాగనివ్వబోమని చెప్పారాయన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com