దక్షిణ నార్వే సముద్రంలో రెస్టారెంట్
- November 06, 2017
సముద్రం ఒడ్డున ఉన్న రెస్టారెంట్‌లో కూర్చొని సముద్ర అందాల్ని వీక్షిస్తూ భోజనం చేయడంలో మజా ఏముందనుకున్నారో ఏమో... ఏకంగా సముద్రంలోపలే ఓ రెస్టారెంట్‌ని నిర్మించేశారు నార్వే వాసులు...జనాలు వెరైటీని కోరుకుంటున్నారు. తినే ఫుడ్డులో, వేసుకునే బట్టల్లో ఆఖరికి జీవన శైలిలో కూడా.. అందుకే ఇలాంటి వారినే దృష్టిలో పెట్టుకునే కొంత మంది క్రియేటివ్ హెడ్స్ కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఆకర్షిస్తున్నారు...
భూమి మీద, ఎత్తైన కొండల్లో, అండర్ గ్రౌండ్‌లో ఫైవ్ స్టార్ లాంటి హోటల్స్ ఏర్పాటు చేసినా ఇంకా ఏదో వెరైటీ చేయాలన్న తలంపుతో యూరప్‌లోని నార్వేలో తొలి అండర్ వాటర్ రెస్టారెంట్ ఒకటి ఏర్పాటు చేశారు. దక్షిణ నార్వేలో ఉన్న ఈ రెస్టారెంట్‌ని 36 అడుగుల పనోరామిక్ విండోతో నిర్మించారు. ఇది బయటి నుంచి చూస్తే ఓ పెద్ద రాయి సముద్రంలో మునిగిపోతున్నట్లుగా ఉంటుంది. ఒకేసారి వంద మంది ఆతిధ్యం స్వీకరించేలా ఏర్పాటు చేశారు ఈ రెస్టారెంట్‌ని. సముద్ర అలల ప్రభావం ఈ రెస్టారెంట్ పై పడకుండా కాంక్రీట్ గోడలు నిర్మించారు. ఈ రెస్టారెంట్‌ని వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!