ఉత్తరకొరియాకు ట్రంప్ హెచ్చరికలు
- November 07, 2017
సియోల్: వరుస అణ్వస్త్ర పరీక్షలు, క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న ఉత్తర కొరియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా తొలుత జపాన్‌కు వెళ్లిన ట్రంప్ సోమవారం జపాన్ ప్రధాని షింజో అబేతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉత్తరకొరియాపై వ్యూహాత్మక సహనం నశిస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం దక్షిణకొరియాకు చేరుకున్న ఆయన ఆ దేశ అధ్యక్షుడు మూన్ జే యిన్‌తో సమావేశమయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అనంతరం సంయుక్తంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ట్రంప్ ఉత్తర కొరియాపై మరోసారి మండిపడ్డారు. ఉత్తర కొరియాతో అణుయుద్ధం వస్తే తమ పూర్తి సైనికశక్తిని వినియోగిస్తామని హెచ్చరించారు. 'నియంత కిమ్ బెదిరింపు ధోరణిని నియంత్రించేందుకు యావత్ సైనికశక్తిని ఉపయోగించేందుకు సిద్ధం.
కిమ్ బెదిరింపులకు భయపడబోం' అని తేల్చిచెప్పారు.
తొలుత సియోల్‌కు దగ్గర్లోని ఓసాన్ ఎయిర్ బేస్‌లో తన సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి దిగిన ట్రంప్‌కు అధికారులు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక హెలీకాఫ్టర్లో బయల్దేరి ఆ దేశంలోని అతిపెద్ద యూఎస్ మిలటరీ బేస్ వద్దకు చేరుకున్నారు. అక్కడ మూన్తో కలిసి అమెరికా, దక్షిణ కొరియా సైనికులతో సమావేశమయ్యారు.
ఉత్తరకొరియా అంశంపై వారితో చర్చించారు. అలాగే, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఉత్తరకొరియాతో సవాళ్లను ఎదుర్కొంటూనే అమెరికా, దక్షిణ కొరియా వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు విశేష కృషిచేస్తున్నారని కొనియాడారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!