పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'బయటకొచ్చి చూస్తే..' పాట మ్యూజిక్ కర్త ఇతనే...

- November 08, 2017 , by Maagulf
పవర్ స్టార్  పవన్ కల్యాణ్ 'బయటకొచ్చి చూస్తే..' పాట మ్యూజిక్ కర్త ఇతనే...

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కి తెలుగు సినీ ప్రేక్షకులు గ్రాండ్ వెల్‌‌కమ్ చెప్పారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ , స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం చిత్రీకరణను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కల్యాణ్  నటిస్తున్న 25వ సినిమా ఇది కావడం విశేషం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా సినిమా జనవరి 10న విడుదల కానుంది. 
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన `జల్సా`, `అత్తారింటికి దారేది` సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే. వీటి తరువాత వచ్చే  హ్యాట్రిక్ మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమాలో అనిరుధ్ కంపోజ్ చేసిన పాట `బయటకొచ్చి చూస్తే ...` హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన గంటల్లోనే ఆ లిరికల్ సాంగ్‌కు  మిలియన్ వ్యూస్ రావడంతో సెన్సెషన్ గా మారింది. అనిరుధ్ కంపోజిషన్ లో వచ్చే మిగిత పాటల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com