బుర్జ్ పార్క్‌లో దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్
- November 09, 2017
దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్, డిఎఫ్‌సి - బుర్జ్ పార్క్‌ని ఔట్ డోర్ జిమ్‌గా ఈ వారంతంలో మార్చేయడానికి రంగం సిద్ధం చేసింది. మూడు మొబైల్ ఫిట్నెస్ యూనిట్స్, దుబాయ్ రెసిడెంట్స్ అలాగే విజిటర్స్ కోసం ఏర్పాటు చేస్తున్నారు. రోవింగ్ మెషీన్స్, క్రాస్ ఫిట్ ట్రెయినర్స్, వెయిట్ ఎక్విప్మెంట్ వంటివి ఇక్కడ ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. ఎక్స్ట్రా థర్స్డే పేరుతో బుర్జ్ పార్క్‌లో కేవలం మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు అలాగే సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఇది అందుబాటులో ఉంటుంది. అన్ని వయసులవారికీ ఫిట్నెస్ చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలోనే అన్ని వయసులవారినీ ఎంకరేజ్ చేసేలా దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంది.20 అక్టోబర్ నుంచి 18 నవంబర్ వరకు 30 రోజులపాటు దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు చేపడుతోంది. రోజూ 30 నిమిషాల వ్యాయామం సంపూర్ణ ఆరోగం కోసం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!