మస్కట్‌లో స్మార్ట్‌ సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌

- November 09, 2017 , by Maagulf
మస్కట్‌లో స్మార్ట్‌ సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌

మస్కట్‌: మస్కట్‌ మునిసిపాలిటీ, గవర్నరేట్‌ పరిధిలో లైటింగ్‌ కోసం ఇంటెలిజెంట్‌ సెంట్రల్‌ సిస్టమ్‌ని ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. మొత్తం 40 ఎలక్ట్రికల్‌ గ్రిడ్స్‌ని ఈ మేరకు ఇన్‌స్టాల్‌ చేశారు. తద్వారా సంబంధిత సమాచారాన్ని సేకరించి, విశ్లేషించడానికి వీలవుతుంది. మస్కట్‌ మునిసిపాలిటీ లైటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ జియాద్‌ అల్‌ జద్జాలి మాట్లాడుతూ, స్ట్రీట్‌ లైట్స్‌ని సిమ్యులేషన్‌ సిస్టమ్‌ ద్వారా మేనేజ్‌ చేయడం ఈ ప్రాజెక్ట్‌ ఉద్దేశ్యమని అన్నారు. ఎక్కడైనా ఎలాంటి అవాంతరాలు, ఇబ్బందులు తలెత్తితే డైరెక్ట్‌గా అక్కడికే వెళ్ళి పరిస్థితిని సమీక్షించేందుకు ఈ కొత్త విధానం ఉపకరిస్తుందని వివరించారాయన. ప్రయోగాత్మక దశలో వచ్చిన ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్ట్‌పై పూర్తి అవగాహన వస్తుందని అధికారులు చెబుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com