ఏక ఛత్రాపత్యం దిశగా సౌదీ యువరాజు చర్యలు

- November 11, 2017 , by Maagulf
ఏక ఛత్రాపత్యం దిశగా సౌదీ యువరాజు చర్యలు

- వెల్లువెత్తుతున్న అసంతృప్తి జ్వాలలు 
ఇప్పటివరకు సౌదీలో అమలవుతూ వస్తున్న రాయల్‌ బ్యాలెన్సింగ్‌ యాక్ట్‌ (రాచకుటుం బంలో అందరికీ అధికారాల పంపిణీ చేస్తూ సమ తుల్యత పాటించడం)ను సౌదీ యువరాజు విడనా దాయ్‌. ఏక వ్యక్తి పాలన దిశగా అడుగు ముందు కేశారు. అవినీతి ప్రక్షాళన పేరుతో పలువురు కోటీశ్వ రులు, యువరాజులు, వ్యాపారవేత్తలను గృహ నిర్బంధంలో వుంచారు. ఇన్నాళ్ళు సౌదీ రాజరిక వ్యవస్థ అనుసరిస్తూ వచ్చిన పద్ధతికి, వ్యవస్థకు స్వస్తి చెబుతూ ఈ చర్యలు తీసుకున్నారు. కుటుంబ సభ్యు లకు అధికారాలను పంచుతూ వచ్చిన పద్థతికి తిలోదకాలిచ్చారు.. 'రాజు అందరికంటే ముందు అం దులో సందేహం లేదు. అయితే అధికారాలను పం చుకోవాలి'. అని టెక్సాస్‌లోని ఎ అండ్‌ ఎం యూని వర్శిటీలో సౌదీ వ్యవహారాల నిపుణుడు గ్రెగరీ గాజ్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో కమి టీలు వుండేవి, దీనివల్ల పెద్ద పెద్ద తప్పిదాలు, పొరపాట్లు నివారిం చుకోవడానికి, అప్రమత్తంగా వుండేందుకు, నిర్ణయా లను మళ్ళీ పరిశీలించేందుకు అవకాశాలు వుండేవని ఆయన పేర్కొన్నారు. అదే ఇప్పుడు ఏక వ్యక్తి పాలన లోకి వస్తే ఇవన్నీ పోతాయని, నిర్ణాయక క్రమంలో వుండే తనిఖీలు అదృశ్యమవుతాయని వ్యాఖ్యానిం చారు.

కాగా, దాదాపు వంద బిలియన్ల డాలర్ల మేర కు నిధులు దుర్వినియోగం అయ్యాయని, ఇదంతా కూడా వ్యవస్థాగతమైన అవినీతి ద్వారానే జరిగిం దని, అనేక దశాబ్దాలుగా ఈ స్వాహా సాగుతోందని అటార్నీ జనరల్‌ సాద్‌ అల్‌ మొజెబ్‌ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే రెండు వారాల క్రితం ప్రపంచం లోనే ప్రఖ్యాత పెట్టుబడిదారులతో రియాద్‌లో సమావే శాన్ని నిర్వహించారు. ఆ తర్వాత కొద్ది రోజు లకే అవి నీతిపరులపై కొరడా ఝళిపించారు. అయి తే తమపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కొంత మంది సౌదీ అధికారులు తమ పద్ధతి మార్చు కోవడంలేదు.

ప్రభుత్వం చేపడుతున్న అవినీతి నిరోధక చర్యలను తప్పుపడుతున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com