'రైట్ రైట్' ఫస్ట్ లుక్ పోస్టర్ ని దీపావళి సందర్బంగా విడుదల
- November 10, 2015
రీసెంట్ గా 'కొలంబస్' అంటూ పలకరించిన సుమంత్ అశ్విన్ .. త్వరలో కండక్టర్ గా కనిపించి అలరించనున్నారు. మళయాళ చిత్రం ఆర్డనరీ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రానికి 'రైట్ రైట్' అనే టైటిల్ పెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ని దీపావళి సందర్బంగా విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. శ్రీ సత్య ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నూతన దర్శకుడు మను దర్శకత్వంలో జె. వంశీకృష్ణ నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 7న ఆరంభం కానుంది. ఈ చిత్రవిశేషాలను జె. వంశీకష్ణ తెలియజేస్తూ - "మంచి కథలు, పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ సాగిస్తున్న సుమంత్ అశ్విన్ ఖాతాలో ఇది మరో మంచి చిత్రం అవుతుంది. ఇప్పటివరకూ ఆయన చేసిన చిత్రాలకు, పాత్రలకు పూర్తి భిన్నంగా సాగే చిత్రం ఇది. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఓ సంచలన చిత్రానికి ఇది రీమేక్. 'మర్యాద రామన్న', 'బాహుబలి' చిత్రాల్లో విలన్ గా చేసిన ప్రభాకర్ ఇందులో కామెడీ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆ పాత్ర ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇతర తారాగణం వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. విజయనగరం, అరకు లోయ పరిసర ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్ లో చిత్రాన్ని పూర్తి చేస్తాం. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నాం. యూత్, ఫ్యామిలీస్ ని ఆకట్టుకునే విధంగా ఈ 'రైట్ రైట్' ఉంటుంది'' అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: 'డార్లింగ్' స్వామి, కెమెరా: శేఖర్ వి. జోసఫ్, సంగీతం: జె.బి, ఆర్ట్: కె.ఎం. రాజీవ్, సహ నిర్మాత: జె
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







