2 లక్షల 437 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసుల నమోదు : 50 వేల107 కువైట్ దినార్ల జరిమానా

- November 13, 2017 , by Maagulf
2 లక్షల 437 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసుల నమోదు : 50 వేల107 కువైట్ దినార్ల జరిమానా

కువైట్ :  ' రాజుల సొమ్ము రాళ్ళ పాలు ...వాహనదారుల ఉల్లంఘనల జరిమానాలు ట్రాఫిక్ శాఖ పాలుగా మారింది.  జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంటు గణాంకాల ప్రకారం అక్టోబరు మాసం చివరి నాటికి పలువురు వాహనదారులు 2.437 మిలియన్ల ఉల్లంఘనలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ  ఉల్లంఘనల్లో ప్రత్యక్ష ఉల్లంఘనలు మరియు ట్రాఫిక్ పర్యవేక్షణ కెమెరాల ద్వారా 970,000 కేసులు నమోదు చేయబడినవ వని ఇందులో నేరుగా 1 లక్షా 467 మంది పౌరుల ఉల్లంఘనలు నమోదుచేయబడినట్లు పేర్కొన్నారు. అదే విధంగా రోజుకి సుమారు 8,333 ఉల్లంఘనలు జరిగాయి. ఈ కాలంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై  50 వేల107 కువైట్ దినార్ల జరిమానా విధించారు. చిత్రమేమిటంటే  ఈ కాలంలోనే 147 మంది ప్రవాసీయులు లైసెన్సు లేకుండా వివిధ వాహనాల డ్రైవింగ్  చేస్తూ పట్ట్టుబడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com