స్నేహితుడిని సరదాగా సముద్రంలోకి నెట్టి ఆ వ్యక్తి చావుకి కారణమయిన ఇద్దరు కార్మికులు

- November 13, 2017 , by Maagulf
స్నేహితుడిని సరదాగా సముద్రంలోకి నెట్టి  ఆ  వ్యక్తి చావుకి కారణమయిన ఇద్దరు కార్మికులు

అబుదాబి : " నిప్పుతోనూ..నీళ్ళతోనూ పరాచికాలు ఆడవద్దని " మన పెద్దలు పదే పదే చెబుతుంటారు..కానీ నది వద్దకో...సముద్రం చెంతకు వెళ్ళినపుడు ఆ హితబోదని ఎంచక్కా మర్చిపోతాం. అచ్చం ఇదేవిధంగా అబూధాబీలో గత వారాంతంలో ఓ విషాదం చోటు చేసుకొంది. ఇద్దరు కార్మికులు అత్యుత్సాహం ప్రదర్శించి  తమ స్నేహితుడిని పొట్టన పెట్టుకొన్నారు. ఆ వ్యక్తిని " సరదాగా " సముద్రంలోకి నెట్టి అతని చావుకి ప్రత్యక్ష కారణమయ్యెరనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అల్ డఫ్రాలోని మొదటి ఇన్స్పెషన్లోని క్రిమినల్ కోర్ట్ ఈ సంఘటన ఆసియా దేశాలకు చెందిన మిత్రులు గత వారాంతంలో ఈత కోసం సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు సంఘటన జరిగింది. వారు లోతైన నీటిలో ఈత కొట్టి ఒడ్డుకి వచ్చి తీరానికి సమీపంలో నిలబడినప్పుడు, ఆ వ్యక్తులలో  ఒకరు సరదాగా సహోద్యోగి "తన బ్యాలెన్స్ తనిఖీ " చేసేందుకు సముద్రంలోకి నెట్టాడు. దాంతో   బాధితుడు ఆకస్మికంగా పట్టు తప్పి నీటిలో ఉన్న ఒక కొండరాతికి బలంగా అతని తల తగిలింది. దాంతో తీవ్రంగా రక్తస్రావం జరిగి అక్కడికక్కడే  మరణించాడు. దీంతో మృతుని సహచరులు ఆ సన్నివేశం నుంచి భయంతో పారిపోయారు ఎందుకంటే ఆ వ్యక్తి మరణానికి తమనే బాధ్యులుగా గురిచేస్తారని వారు భయపడ్డారు. తమ స్నేహితుడు చనిపోయినట్లు ఆ విషయాన్ని పోలీసులకు నివేదించలేదు. తర్వాత పోలీసులు మృతి చెందిన ఉద్యోగిని బీచ్ వద్ద కనుగొన్నారు మరియు పోలీసుల విచారణలో మృతిని  సహచరులు ఇద్దరికి ఆ మరణంతో పాలుపంచుకున్నారని తేలింది. తెలియక చేసిన తమ తప్పుని మన్నించి చనిపోయిన తమ స్నేహితుని కుటుంబానికి రక్తపరాధ సొమ్ము చెల్లిస్తామని.తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోర్టులో న్యాయమూర్తిని ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. కాగా  నవంబర్ 26 వ తేదీన విచారణ వాయిదా పడింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com