స్నేహితుడిని సరదాగా సముద్రంలోకి నెట్టి ఆ వ్యక్తి చావుకి కారణమయిన ఇద్దరు కార్మికులు
- November 13, 2017_1510586485.jpg)
అబుదాబి : " నిప్పుతోనూ..నీళ్ళతోనూ పరాచికాలు ఆడవద్దని " మన పెద్దలు పదే పదే చెబుతుంటారు..కానీ నది వద్దకో...సముద్రం చెంతకు వెళ్ళినపుడు ఆ హితబోదని ఎంచక్కా మర్చిపోతాం. అచ్చం ఇదేవిధంగా అబూధాబీలో గత వారాంతంలో ఓ విషాదం చోటు చేసుకొంది. ఇద్దరు కార్మికులు అత్యుత్సాహం ప్రదర్శించి తమ స్నేహితుడిని పొట్టన పెట్టుకొన్నారు. ఆ వ్యక్తిని " సరదాగా " సముద్రంలోకి నెట్టి అతని చావుకి ప్రత్యక్ష కారణమయ్యెరనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అల్ డఫ్రాలోని మొదటి ఇన్స్పెషన్లోని క్రిమినల్ కోర్ట్ ఈ సంఘటన ఆసియా దేశాలకు చెందిన మిత్రులు గత వారాంతంలో ఈత కోసం సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు సంఘటన జరిగింది. వారు లోతైన నీటిలో ఈత కొట్టి ఒడ్డుకి వచ్చి తీరానికి సమీపంలో నిలబడినప్పుడు, ఆ వ్యక్తులలో ఒకరు సరదాగా సహోద్యోగి "తన బ్యాలెన్స్ తనిఖీ " చేసేందుకు సముద్రంలోకి నెట్టాడు. దాంతో బాధితుడు ఆకస్మికంగా పట్టు తప్పి నీటిలో ఉన్న ఒక కొండరాతికి బలంగా అతని తల తగిలింది. దాంతో తీవ్రంగా రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మరణించాడు. దీంతో మృతుని సహచరులు ఆ సన్నివేశం నుంచి భయంతో పారిపోయారు ఎందుకంటే ఆ వ్యక్తి మరణానికి తమనే బాధ్యులుగా గురిచేస్తారని వారు భయపడ్డారు. తమ స్నేహితుడు చనిపోయినట్లు ఆ విషయాన్ని పోలీసులకు నివేదించలేదు. తర్వాత పోలీసులు మృతి చెందిన ఉద్యోగిని బీచ్ వద్ద కనుగొన్నారు మరియు పోలీసుల విచారణలో మృతిని సహచరులు ఇద్దరికి ఆ మరణంతో పాలుపంచుకున్నారని తేలింది. తెలియక చేసిన తమ తప్పుని మన్నించి చనిపోయిన తమ స్నేహితుని కుటుంబానికి రక్తపరాధ సొమ్ము చెల్లిస్తామని.తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోర్టులో న్యాయమూర్తిని ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. కాగా నవంబర్ 26 వ తేదీన విచారణ వాయిదా పడింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!