69 ఏళ్ల వయసులో పదో పెళ్ళికి రెడీ అవుతున్న బ్రిటన్ కు చెందిన రాన్ పెఫర్డ్

- November 14, 2017 , by Maagulf
69 ఏళ్ల వయసులో పదో పెళ్ళికి రెడీ అవుతున్న బ్రిటన్ కు చెందిన రాన్ పెఫర్డ్

ఆడపిల్లల కొరతతో... మగమహారాజులు పెళ్లి కానీ బ్రహ్మచారులుగా... ముదురు బెండకాయలుగా అయిపోతుంటే... ఆయన మాత్రం ఓ భార్య విడిచి వెళ్ళాక మరో భార్య.. అంటూ పెళ్లి మీద పెళ్లి చేసుకొంటూనే ఉన్నాడు. ఇప్పటికే 9 తొమ్మిది పెళ్లిళ్లు చేసుకొన్న రాన్ పెఫర్డ్ 69 ఏళ్ల వయసులో పదో పెళ్ళికి రెడీ అవుతున్నాడు. తన కంటే 41 ఏళ్ల చిన్నదైన క్రిస్టెట్ మార్క్వెజ్ పెషార్డ్ ఇటీవలే రాన్ పెఫర్డ్ ను వదిలేసింది. దీంతో ఆయన తన పదో పెళ్లి కి రంగం సిద్ధం చేసుకొంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. 
బ్రిటన్ కు చెందిన రాన్ పెఫర్డ్ ను వివాహం చేసుకొన్న ప్రతి మహిళ ఆయనతో కాపురం చేసిన కొద్ది నెలలకే వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇటీవలే పెఫర్డ్ ను క్రిస్టెట్ మార్క్వెజ్ 28 ఏళ్ల వయసులో విడిచి పెట్టింది. దీంతో తాను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న పెఫర్డ్ అనువైన మహిళ కోసం గాలిస్తున్నాడు. కాగా ఈ సారి తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పరిణితి చెందిన యువతిగా ఉండాలని... కనీసం 30 ఏళ్ల మహిళ అయితే తనకు ఒకే అని అంటున్నారు. అందుకని ఫేస్ బుక్ లో తగిన మహిళ కోసం వెదుకుతున్నాడు. రాన్ పెఫర్డ్ 1966 లో తొలిసారిగా మార్గరేట్ అనే మహిళను పేలిల్ చేసుకొన్నాడు. ఆమె రెండు ఏళ్ళు కాపురం చేసి ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు ఇచ్చింది. దీంతో 1973 లో రెండో భార్యగా జెనెట్టేను వివాహం చేసుకొన్నాడు.. కొన్ని నెలలకే విడాకులు ఇవ్వగాలల. ముచ్చటగా మూడోసారి 1976 లో లేస్లీ అనే మహిళను పెళ్లి చేసుకొన్నాడు... ఇద్దరు కుమారులు పుట్టాక ఆమెకు విడాకులు ఇచ్చి.. 1982 లో కాథీని పెళ్లి చేసుకొన్నాడు. 1986లో సునూ ఐదో భార్యగా పెఫర్డ్ జీవితంలోకి ప్రవేశించగా.. ఒక కుమార్తె పుట్టిన తర్వాత 1997 లో వీరిబంధానికి బ్రేక్ పడింది. దీంతో ఉష ను 1999 లో ఆరోభార్యగా పెళ్లి చేసుకొన్నారు. 4 ఏళ్ల అనతరం వీరు కూడా విడిపోయారు. 2003 లో మళ్ళీ వాన్ అనే యువతిని పెళ్లి చేసుకొంటే, నాలుగు నెలలకే గుడ్ బై చెప్పేసింది. దీంతో 2004లో ఎనిమిదో భార్య గా వాంగ్ అనే 18 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకొన్నాడు. పదేళ్ళ కాపురం తర్వాత 2015 లో వీరు సంసారనికి గుడ్ బై చెప్పేశారు. తొమ్మిదో భార్య గా వచ్చిన క్రిస్టెట్ గత వారం కృతమే తమ బంధానికి తెర దించింది. దీంతో రాన్ పెఫర్డ్ పదో పెళ్లికి రెడీ అవుతున్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com