మాల్యా కోసం ఆర్థర్ రోడ్లో జైలు సిద్దం!
- November 14, 2017
ఢిల్లీ: దేశంలోని వివిధ బ్యాంకులలో వేల కోట్లు రుణాలు తీసుకొని ప్రస్తుతం లండన్లో నివాసం ఉంటున్న రుణ ఎగవేతదారు విజయ్ మాల్యా కోసం ముంబైలోని ఆర్థర్ రోడ్లోని జైలు సిద్ధంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. సరైన సదుపాయాలుగల జైలు లేదని విజయ్ మాల్యా సాకులు చెప్తుండటంతో భారత ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వానికి ఈ స్పష్టతనిచ్చింది. తనను భారతదేశానికి అప్పగించడంలో మరింత ఆలస్యమయ్యేలా చేయడానికి మాల్యా ఈ విధమైన పన్నాగాలు పన్నుతున్నారు. భారతదేశంలోని జైళ్ళలో తన జీవితానికి, ప్రాణాలకు రక్షణ ఉండదని మాల్యా ఆరోపిస్తున్నారు. ఈ నెల 20న బ్రిటన్ కోర్టు ఈ కేసులో విచారణ జరుపుతుంది. భారతదేశంలోని జైలు వివరాలను తెలియజేయడానికి ఆర్థర్ రోడ్ జైలు అధికారులు, కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులు బ్రిటన్ వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. మాల్యా ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకుండా కట్టుదిట్టమైన వాదనలను వినిపించబోతున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!