అలర్జీలనుంచి ఉపశమనం పొందండిలా..

- April 30, 2015 , by Maagulf
అలర్జీలనుంచి ఉపశమనం పొందండిలా..

అలర్జీ బాధితులకి ప్రధాన సమస్య నిద్రలేమి. ఎలాగోలా నిద్రపట్టినా మధ్యలో మెలకువ వచ్చేయడంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్యలనుంచి బయటపడాలంటే బెడ్రూమ్లో వీలైనంతవరకూ అలర్జీ కారకాలు లేకుండా జాగ్రత్త పడాలి. నిపుణులు సూచిస్తున్న కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అలర్జీ సమస్యలనుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. దుప్పట్లను, దిండ్లను వారానికి ఓ సారి వేడి నీటితో ఉతకాలి. దీంతో తవిటి పురుగులు లాంటివి ఏమైనా వుంటే చనిపోతాయి. దాంతోపాటుగా, పరుపు మొత్తం కప్పి ఉంచే అలర్జీ నిరోధక కవర్లు వాడుకుంటే మంచిది. గదిలో గాలిని శుభ్రం చేసే పరికరకాలు వాడుకోవడం ఇంకా ఉత్తమం. వాక్యూమ్ క్లీనర్తో పరుపును శుభ్రం చేసుకోవాలి. మూలల్లో ఎలాంటి దుమ్మూ లేకుండా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. బయటి నుంచి ధూళి రాకుండా కిటికీలను మూసి ఉంచుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే నిద్రలేమి నుంచి అలర్జీ బాధితులు బయటపడగలుగుతారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com