ఏపీ తో టొయోటా ఒప్పందం

- November 15, 2017 , by Maagulf
ఏపీ తో టొయోటా ఒప్పందం

అమరావతి: ప్రపంచ దిగ్గజ కార్ల కంపెనీ టయోటాతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒప్పందం చేసుకోనుంది. ఏపీలో ఎలక్ర్టానిక్‌ కార్లను ప్రోత్సహించడం, కొన్ని కార్లను ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చేందుకు మంత్రి లోకేశ్‌ సమక్షంలో ఈ ఒప్పందం జరగనుంది. టయోటా కంపెనీకి చెందిన రెండు మోడళ్ల కార్లను తొలి దశలో ఏపీ ప్రభుత్వానికి సదరు సంస్థ ఉచితంగా అందిస్తుంది. ఈ కంపెనీ భారత్‌లో ఇలాంటి ఒప్పందం తొలిగా ఏపీతోనే చేసుకుంటోంది. దీనికోసం గుజరాత్‌, మహారాష్ట్ర పోటీపడినా రాష్ట్రంవైపే కంపెనీ మొగ్గుచూపేలా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ చేసిన చర్చలు ఫలించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com