తెలుగు, హిందీలో 'గోపీచంద్' బయోపిక్
- November 16, 2017
ముంబయి: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్ జీవితాధారంగా బయోపిక్ తెరకెక్కించాలని కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఈరోజు గోపీచంద్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ విషయం గురించి చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఫాక్స్ స్టార్ స్టూడియోస్, అబండన్టియా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా గోపీచంద్ బయోపిక్‌ను నిర్మిస్తున్నాయి. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. 2018 మే నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుంది. 'గరుడవేగ'తో విజయాన్ని అందుకొన్న ప్రవీణ్ సత్తారు దీనిని తెరకెక్కిస్తున్నారు. సుధీర్‌బాబు టైటిల్‌రోల్ పోషించే అవకాశం ఉంది.
అయితే ఇందులో రీల్ లైఫ్ గోపీచంద్‌గా ఎవరు నటించనున్నారు అన్న వివరాలు మాత్రం ఇంకా ప్రకటించలేదు. మరోపక్క బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు పి.వి సింధు, సైనా నెహ్వాల్ బయోపిక్‌లు కూడా రాబోతున్నాయి.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







