ఏందో మన రాహుల్ బాబు గోల!!
- November 16, 2017
దిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగాల్లో ఒక్కోసారి తప్పులు దొర్లుతుంటాయి. ప్రత్యర్థులు వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తుండడంతో అవి మరింత వైరల్ అవుతుంటాయి. గతంలో బెంగళూరులో 'ఇందిరా క్యాంటీన్లు' ప్రారంభించిన సమయంలో రాహుల్ ప్రసంగిస్తూ.. క్యాంటీన్లకు బదులు క్యాంపెయిన్ అన్నారు. బెంగళూరులోని అన్ని ప్రాంతాల్లో అనాల్సిందిపోయి అన్ని రాష్ట్రాల్లో అన్నారు.
తాజాగా రాహుల్ ప్రసంగానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ అహ్మదాబాద్‌లో ప్రసంగిస్తూ.. 'బంగాళాదుంపల్ని యంత్రంలో పెట్టగానే బంగారం వచ్చేలా ఓ యంత్రం తయారుచేస్తా. దీని వల్ల రైతులకు బాగా డబ్బులు వస్తాయి' అని వ్యాఖ్యానించారు.
రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఉత్తర్‌ప్రదేశ్ రైతులను ఉద్దేశిస్తూ.. 'మామిడి పండ్లను తయారుచేసే యంత్రాలు' అంటూ వ్యాఖ్యానించారు. దాంతో రైతులు మామిడి పండ్లను పండిస్తే రాహుల్ మాత్రం వాటిని తయారు చేస్తారంటూ ఛలోక్తులు విసిరారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







