దొంగల చేతిలో ఆవిరైన విద్యార్ధి ప్రాణం
- November 16, 2017
అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఓ స్టోర్‌లో జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. నలుగురు నలుగురు సాయుధ దుండగులు కలిసి ఈ విద్యార్థిని కాల్చివేశారు. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోసిటీలో ఈ సంఘటన మంగళవారం జరిగింది.
ఫ్రెస్నోసిటీలోని గ్యాస్ స్టేషన్లో లూటీ చేసిన నలుగురు దుండగులు ఆ ప్రక్కనే ఉన్న జనరల్ స్టోర్‌లో క్యాష్ కౌంటర్ వెనుక భాగంలో ఉన్న 21 యేళ్ల ధర్మప్రీత్ సింగ్ జస్సార్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జస్సార్ నేలకొరిగాడు. మృతుడు పంజాబ్‌కు చెందిన విద్యార్థిగా గుర్తించారు.
ఇదిలావుండగా, ఈ సంఘటనను అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి న్యాయం జరిగేటట్లు చూడాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ కోరుతూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన సుష్మా స్వరాజ్.. .అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో పాటు ధర్మఫ్రీత్ సింగ్ జస్సార్ కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!