కోటి మార్క్‌ను కొట్టేసిన ఎయిర్ ఇండియా
- November 17, 2017
ముంబయి : మొట్ట మొదటి సారి విమాన ప్రయాణికుల సంఖ్య కోటి మార్క్‌ను చేరింది. ఈ ఏడాది అక్టోబర్‌లో 10.45 మిలియన్లుగా నమోదయ్యిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) శుక్రవారం వెల్లడించింది. గతేడాది ఇదే మాసం ప్రయాణికులతో పోల్చితే ఏకంగా 20.52 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా 80 శాతం సామర్థ్యాన్ని వినియోగించుకుందని తెలిపింది. బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో ఏకంగా 41.33 లక్షల ప్రయాణికులను చేరవేసింది. రెండో స్థానంలో జెట్ ఎయిర్‌వేస్ 15.88 లక్షల ప్యాసింజర్లను గమ్యానికి చేర్చింది. కాగా తర్వాత స్థానాల్లో ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, గో ఎయిర్, ఎయిర్ ఆసియా ఇండియా సంస్థలు అధిక మంది ప్రయాణికులను చేర్చాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!







