ఎయిరిండియా పిల్లలకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
- November 12, 2015
బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు ఎయిరిండియా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నవంబర్ 14వ తేదీన తమ విమానాల్లో ప్రయాణించే పిల్లలకు ఆ తర్వాత ఓ డ్రా నిర్వహించి, అందులో విజేతలకు ఉచితంగా విమాన టికెట్లు ఇవ్వనున్నారు. లక్కీ డ్రాలో మొదటి బహుమతి సాధించిన వాళ్లకు ఢిల్లీ- శాన్‌ఫ్రాన్సిస్కో- ఢిల్లీ మార్గంలో వెళ్లేందుకు నాలుగు ఎకానమీ టికెట్లు ఇస్తారు. రెండో బహుమతి సాధించినవాళ్లకు నాలుగు ఉచిత స్వదేశీ రిటర్న్ టికెట్లు ఇస్తారు. మూడో బహుమతి సాధించిన వాళ్లకు ఒక డొమెస్టిక్ సెక్టార్ టికెట్‌పై నాలుగు అప్‌గ్రేడ్ ఓచర్లు ఇస్తారు. ఈ ఆఫర్ 12 ఏళ్ల లోపు వయసున్న వాళ్లకు మాత్రమే పరిమితం అవుతుంది. డిసెంబర్ మొదటి వారంలో ఈ డ్రా తీస్తారు. పిల్లలు తమ ప్రయాణ వివరాలను ఎయిరిండియా కార్యాలయానికి నవంబర్ 30వ తేదీలోగా పంపాల్సి ఉంటుంది. దీంతోపాటు నవంబర్ 14న ఎయిరిండియా విమానాల్లో ప్రయాణం చేసే పిల్లలకు ప్రత్యేకంగా స్వీట్లు, బొమ్మలు కూడా ఇవ్వనున్నారట.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







