ఒమన్ మహిళ యుటెరస్ నుంచి 191 ట్యూమర్స్ తొలగింపు
- November 19, 2017
మస్కట్: ఒమన్ మహిళకు, భారతదేశంలోని కేరళలో గల ఓ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. స్టార్ కేర్ హాస్పిటల్‌లో జరిగిన ఈ సర్జరీలో, మహిళ యుటెరస్ నుంచి 191 ట్యూమర్స్‌ని విజయవంతంగా వైద్యులు తొలగించారు. ఇది గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ కోసం కూడా పంపినట్లు అధికారులు తెలిపారు. ఈజిప్ట్‌లో ఓ పేషెంట్ నుంచి 186 ట్యూమర్స్ తొలగించడం ఇప్పటిదాకా రికార్డ్‌గా ఉందని డాక్టర్ అబ్దుల్ రషీద్ పేర్కొన్నారు. కీహోల్ సర్జరీ టెక్నిక్స్, కన్వెన్షనల్ విధానంలో ఈ సర్జరీ నిర్వహించారు. ఇండియాలో అయితే ఇప్పటిదాకా అత్యధికంగా 84 ట్యూమర్స్ మాత్రమే తొలగించారు. దాంతో తాజాగా జరిగిన సర్జరీ చాలా ప్రత్యేకమైనది. రెండ్రోజుల్లో మహిళను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. స్టార్ కేర్, ఒమన్‌లోనూ రెండు ఆసుపత్రుల్ని నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!







