గల్లంతయిన ఇండియన్ యువకుడి కోసం స్నిఫర్స్ వినియోగం
- November 19, 2017
భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా గల్లంతయిన ఇండియన్ యువకుడి కోసం అన్వేషణ కొనసాగుతోంది. షార్జా, దుబాయ్ పోలీస్ అధికారులు, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి చెందిన ఎయిర్ వింగ్‌తో కలిసి అలాగే కె9 డిపార్ట్‌మెంట్ స్నిఫర్ డాగ్స్‌ని కూడా రంగంలోకి దించారు. షార్జా, దుబాయ్ నుంచి పోలీస్ పెట్రోల్స్ అలాగే సెర్చ్ మరియు రెస్క్యూ యూనిట్ గాలింపు చర్యల్ని మరింత ముమ్మరం చేశారు. ఎయిర్ వింగ్ సహాయంతో కట్టుదిట్టంగా గాలింపు చేపడుతున్నామని ఉన్నతాధికారి ఒకరు వివరించారు. స్నిఫర్ టీమ్‌లో మొత్తం 20కి పైగా శిక్షణ పొందిన డాగ్స్ విధి నిర్వహణలో పాల్గొంటున్నాయి. డిజాస్టర్స్ సమయంలో గల్లంతయినవారిని స్నిఫర్ డాగ్స్ చాలా తేలిగ్గా గుర్తిస్తాయని, ప్రత్యేక పరిస్థితుల్లోనే వీటిని వినియోగించడం జరుగుతోందని ఆ ఉన్నతాధికారి చెప్పారు. భారీ వర్షాల కారణంగా వాడి షీస్‌లో ఓ వాహనం చిక్కుకుపోయిందని తమకు సమాచారం అందడంతో రంగంలోకి దిగామనీ, ఓ ఎమిరేటీ సకాలంలో స్పందించి ఐదుగురు వ్యక్తుల్ని రక్షించగా, ఓ వ్యక్తి వాహనంతో సహా నీటిలో గల్లంతయ్యాడని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







