దక్షిణాఫ్రికాలో భారత రాయబారి ఇంట చోరీ

- November 20, 2017 , by Maagulf
దక్షిణాఫ్రికాలో భారత రాయబారి ఇంట చోరీ

జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో భారత రాయబారి శశాంక్ విక్రమ్ కుటుంబాన్ని బంధించిన దుండగులు... దోపిడీకి పాల్పడ్డారు. డర్బన్‌లోని వారి అధికారిక నివాసంలోనే ఈ దోపిడీ జరగడం గమనార్హం. భారత కాన్సల్ జనరల్‌గా శశాంక్ విక్రమ్.. డర్బన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. శశాంక్ విక్రమ్ ఫ్యామిలీ, ఇద్దరు చిన్నారులు, సిబ్బంది, వీరి వద్దకు వచ్చిన ఓ టీచర్‌ను బంధించిన దుండగులు.. ఇంట్లోని విలువైన ఆభరణాలు, నగదు, వస్తువులను దోచుకెళ్లినట్లు తెలిసింది. అయితే, బాధితులంతా బాగానే ఉన్నారని, కానీ కొంత భయాందోళనకు గురయ్యారని చెప్పారు. దుండగులు ఎవరికీ ఏ హాని తలపెట్టలేదని కాన్సల్ ఎస్కే పాండే తెలిపారు. శశాంక్ ఇంట్లోని ఓ సిబ్బందికి చెందిన ఫోన్‌ను కూడా దొంగలు ఎత్తుకెళ్లారని, దాని ద్వారా నిందితులను పట్టుకోవచ్చని చెప్పారు. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. వియన్నా కన్వెన్షన్ ప్రకారం.. రాయబారులకు రక్షణ కల్పించడం దక్షిణాఫ్రికా బాధ్యత అని భారత్ గుర్తు చేసింది. కాగా, ఘటనపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com