అతడే ఆస్కార్‌కు మళ్లీ హోస్ట్‌!

- November 20, 2017 , by Maagulf
అతడే ఆస్కార్‌కు మళ్లీ హోస్ట్‌!

వచ్చే ఏడాది, అంటే 2018 మార్చి 4న జరిగే ఆస్కార్‌ ఫంక్షన్‌కు హోస్ట్‌గా జిమ్మీ కిమ్మెల్ వ్యవహరిస్తారని ఆస్కార్‌ కమిటీ స్పష్టంగా ప్రకటించింది. 'ఇందులో చెప్పుకోదగిన వార్త ఏముందీ?' అంటూ పెదవి విరిచేయకండి. ఇది నిజానికి పెద్ద వార్తే! సరిగ్గా ఏడాది కిందట, అంటే ఈ ఏడాది మొదట్లో, 2017 ఆస్కార్‌ ఫంక్షన్‌లో పెద్ద గడబిడ జరిగిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. 83 సంవత్సరాల ఆస్కార్‌ చరిత్రలో ఎన్నడూ జరగని ఘోరమైన తప్పు అది. ఆస్కార్‌ వేదిక మీద ఉత్తమ చిత్రంగా 'లా లా ల్యాండ్‌' పేరును హోస్ట్‌ జిమ్మీ కిమ్మెల్ ప్రకటించిన వెంటనే, అది తప్పనీ, ఉత్తమ చిత్రం అది కాదనీ, ఆ పురస్కారం 'మూన్‌లైట్‌' చిత్రానికి దక్కిందనీ తప్పును సవరించుకున్నారు. ఇంత ఘోరమైన తప్పును ఎవరు చేశారనే విషయమై, ఆ తర్వాత పెద్ద పంచాయితీలే జరిగాయి. ముందుగా అందరూ అది జిమ్మీ చేసిన తప్పేనని నిర్ధారించేసి, నిందలు వేసేశారు. 'ఇకపై జిమ్మీకి ఆస్కార్‌ వేదిక ఎక్కే అర్హతకూడా ఉండద'నీ తీర్మానించేశారు. కానీ, ఇప్పుడు అదే వేదిక మీద అదే వ్యక్తికి అవే బాధ్యతలు అప్పగించడం, అందర్నీ ఆశ్చర్యంలో కాదు, ఆనందంలో ముంచెత్తుతోంది. ఆనాటి తప్పు తమ స్టాఫ్‌ మెంబర్లలో కొందరిదేనని, ఆస్కార్‌ కమిటీకి ఆడిటింగ్‌ బాధ్యతలు నిర్వహించే ప్రైస్‌వాటర్‌హౌస్‌ కూపర్స్‌ సంస్థ అంగీకరిచండంతో, జిమ్మీకి మళ్లీ హోస్ట్‌ బాధ్యతలు అప్పగిస్తున్నారన్నమాట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com