హైవేపై కుప్పకూలిన విమానం

- November 20, 2017 , by Maagulf
హైవేపై కుప్పకూలిన విమానం

ఫ్లోరిడా: అది జాతీయ రహదారి. వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. ఇంతలో ఓ చిన్న ఫ్లైట్‌ రహదారివైపు రావడాన్ని వాహనదారులు గమనించారు. కాసేపటికే అది హైవేపై తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా ప్రయాణిస్తోంది. ఇదోదే విన్యాసాల్లో భాగంగా చేస్తున్నారని అనుకున్నారంతా. ఇంతలోనే రెక్కలు రోడ్డు పక్కన ఉన్న చెట్టు కొమ్మలను ఢీకొని విమానం నేలకూలింది. ఈ ఘటన ఫ్లోరిడాలోని పినెల్లాస్‌ కౌంటీలో జరిగింది.

 ఇంతకీ ఏం జరిగిందంటే..
రాక్‌వెల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిన ఒకే ఇంజిన్‌ కలిగిన ఓ చిన్న విమానం క్లియర్‌వాటర్‌ ఎయిర్‌పార్క్‌ నుంచి బయలుదేరింది. ఇందులో పైలట్‌ మార్క్‌ అలెన్‌తో పాటు గ్రెగరీ గినీ అనే ప్రయాణికుడు ఉన్నారు. అనంతరం అక్కడికి 80 కి.మీ దూరంలో ఉన్న జెఫిర్‌హిల్స్‌ మున్సిపల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయి ఇంధనాన్ని నింపుకొని.. తిరిగి వెనక్కి బయల్దేరింది. క్లియర్‌వాటర్‌ ఎయిర్‌ పార్క్‌ ఇంకా రెండు కి.మీ దూరం ఉందనగా ఒక్కసారిగా విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే దగ్గర్లో ఉన్న ఓ హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు పైలట్‌ యత్నించాడు. అయితే, హైవేపై ల్యాండ్‌ అవుతుండగా విమానం రెక్కలు చెట్టు కొమ్మలకు ఢీకొన్నాయి. దీంతో విమానం పల్టీ కొట్టి కుప్పకూలింది. అదృష్టవశాత్తూ విమానంలో ఉన్న ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇదంతా అక్కడే ఉన్న పోలీసు వాహనంలో ఉన్న కెమెరాలో రికార్డయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను పినెల్లాస్‌ కౌంటీ పోలీసులు తమ ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com