ఇకపై ఆరోగ్య ప్రత్యేక కేంద్రాలలో నగదు ఇవ్వకుండా కె నెట్ ద్వారా చెల్లింపులు

- November 20, 2017 , by Maagulf
ఇకపై ఆరోగ్య ప్రత్యేక కేంద్రాలలో నగదు ఇవ్వకుండా కె నెట్ ద్వారా చెల్లింపులు

కువైట్ : కె నెట్ సౌకర్యంను కువైట్ ప్రభుత్వం త్వరలో ఆమోదించనుంది. ఇకపై అన్ని ఆసుపత్రులలో, ఆరోగ్య, ప్రత్యేక కేంద్రాలలో ఎటువంటి నగదు ఇవ్వకుండా కె నెట్ సహాయంతో ఆరోగ్య ఫీజులను  చెల్లించవచ్చని  ఆరోగ్య మంత్రిత్వశాఖ  తెలిపింది. ఫీజు వసూలు చేయటానికి మార్గదర్శకత్వం వహిస్తోంది. ప్రత్యేకించి సాయంత్ర సమయంలో ఆరోగ్య సౌకర్యాలలో అకౌంటింగ్ సిబ్బంది సహాయం ఉండదు కనుక ఇది ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంది. కె నెట్ ఆటోమేటెడ్ ప్రాధమిక సంరక్షణ కల్గి ఉండటమే కాక  ఆసుపత్రులతో ఆటోమేటెడ్ సిస్టమ్ తో తక్షణమే అనుసంధానించబడి ఉంటుంది. మంత్రిత్వ శాఖ తొలిదశలో ప్రయోగాత్మకంగా కె నెట్  ఏర్పాటు పరిశీలించింది. అది విజయవంతం కావడంతో, 30 యంత్రాల ఏర్పాటుచేసింది. ప్రవాసీయులకు ఆరోగ్య రుసుము పెంచాలని నిర్ణయం వెలువడిన తర్వాత ఈ చర్యలు  తీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com