స్మృతి ఇరానీపై హీరో కామెంట్స్...ధీటుగా సమాధానం ఇచ్చిన స్మృతి
- November 21, 2017కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావ్ కామెంట్స్ చేయడం మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది. గోవాలో సోమవారం 48వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇరానీ హాజరయ్యింది.
కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ఇరానియన్ దర్శకుడు మజిద్ మజీది తెరకెక్కించిన 'బియాండ్ ది క్లౌడ్స్' సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమా గురించి వ్యాఖ్యాతగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. 'అరె.. మజిద్ మన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లాగే ఆయన కూడా ఇరానీనే' అని మాట్లాడాడు.
ఇందుకు ఇరానీ స్పందిస్తూ.. 'ఓ మంత్రిపై హీరో రాజ్‌కుమార్ రావ్ కామెంట్ చేశాడు. దీన్ని బట్టే అర్థమవుతుంది ప్రభుత్వం ఎంత సహనంతో వ్యవహరిస్తోందో. ధన్యవాదాలు రాజ్‌కుమార్. కనీసం నీ కామెంట్తోనైనా నీ కాలు విరగొట్టింది భాజపా కార్యకర్తలేనని ఎవ్వరూ మాపై నిందలు వేయకుండా ఉంటారు' అని దీటుగా సమాధానమిచ్చారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?