చెన్నై: సత్యభామ కళాశాల లో తెలుగు యువతి ఆత్మహత్య

- November 22, 2017 , by Maagulf
చెన్నై: సత్యభామ కళాశాల లో తెలుగు యువతి ఆత్మహత్య

చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్ధిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. ఈ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్‌కు చెందిన రాధ మౌనిక కంప్యూటర్ ఇంజినీరింగ్‌ లో మొదటి సంవత్సరం చదువుతోంది. రెండు రోజుల కిందట కళాశాలలో జరిగిన ఇంటర్నల్ ఎగ్జామ్ సందర్భంగా మౌనిక కాపీ కొట్టిందని.. దీంతో ఆమెను ఎగ్జామ్ హాల్ నుంచి అధ్యాపకులు బయటకు పంపించి వేశారు. తదుపరి పరీక్షలకు కూడా అనుమతించలేదు. దీంతో అందరిలో అవమానంగా భావించిన మౌనిక హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

ఆత్మహత్యకు ముందు తన స్నేహితులకు మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్ అని మెసేజ్ పెట్టింది. మౌనిక ఆత్మహత్యకు పాల్పడటంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. మౌనిక మృతదేహాన్ని పంచనామా నిమిత్తం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. మౌనిక తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మౌనిక ఆత్మహత్య విషయం తెలియగానే... తోటి విద్యార్థులు చెన్నై సత్యభామ వర్శిటీలో విధ్వంసం సృష్టించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్ధులు విధ్వంసానికి పాల్పడ్డారు. హాస్టల్ గదులలోని ఫర్నిచర్‌తో పాటు బస్సులు, ఇతర వాహనాలకు విద్యార్థులు నిప్పుపెట్టారు. దీంతో విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విధ్వంసం గురించి సమాచారం అందగానే పోలీసులు పెద్ద ఎత్తున క్యాంపస్‌కు చేరుకుని పరిస్థితి కంట్రోల్ చేశారు. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com