ఇంటర్ తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- November 23, 2017
కేవలం ఇంటర్ అర్హత తో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జాబ్స్ చేయవచ్చు. ఎల్డీసీ, జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకెండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2017కు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్/ సోర్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఎంపికైన వారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం ఇవ్వనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య 3259 కాగా ఎల్డీసీ- 898, సోర్టింగ్ అసిస్టెంట్ 2359, డీఈఓ 2 లు ఉన్నాయి.
విద్యార్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు మాత్రం ఇంటర్మీడియట్‌లో సైన్స్, మ్యాథ్‌మెటిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. ఇంగ్లిష్ లేదా హిందీలో టైపింగ్ స్కిల్స్ ఉండాలి.
వయోపరిమితి: 2018 ఆగస్టు 01 నాటికి 18 నుంచి 27 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఎస్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. మిగతా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రాత పరీక్ష (డిస్క్రిప్టివ్), స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: డిసెంబరు 18
టైర్-1 సీబీటీ తేది: మార్చి 3 నుంచి 26 వరకు
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్‌లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!