ఘనంగా క్రికెటర్ భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్
- November 23, 2017
భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఓ ఇంటి వాడయ్యాడు. నేడు (గురువారం) మీరట్‌లో తన ప్రేయసి నుపుర్ నాగర్‌తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు భువనేశ్వర్. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో భువీ, నుపుర్ నాగర్ల వివాహం ఘనంగా నిర్వహించారు. వివాహం నేపథ్యంలో ప్రధాన పేసర్ భువీకి లంకతో జరగనున్న రెండో, చివరి టెస్టులకు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. కోరుకున్న యువతితోనే కుమారుడు భువీ వివాహం జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు క్రికెటర్ తండ్రి కిరణ్ పాల్ సింగ్.
టీమిండియా సభ్యులు, బీసీసీఐ అధికారులు కూడా ఈ వేడుకకు హాజరయ్యేలా నవంబర్ 26, 30 తేదీల్లో బులంద్షా, ఢిల్లీలో రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. మరో విశేషం ఏంటంటే.. ఈరోజు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి, బాలీవుడ్ నటి సాగరిక ఘట్గేను జహీర్ వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి ఫొటోలను జహీర్ స్నేహితురాలు, స్పోర్ట్ ఫిట్నెస్ స్టూడియో మార్కెటింగ్ హెడ్ అంజనా శర్మ షేర్ చేశారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!