అమరావతిలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి లోకేష్
- November 24, 2017
అమరావతి: 2022 నాటికి అమరావతిలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రాజధాని, పరిసర ప్రాంతాల్లో మూడు ఐటీ క్లస్టర్లు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మంగళగిరి ఆటోనగర్‌లో అక్షర ఎంటర్‌ప్రైజెస్, కేజే సిస్టమ్ ఐటీ సంస్థలకు మంత్రి లోకేశ్ ఇవాళ భూమి పూజ చేశారు. ఒక్క మంగళగిరి ఐటీ క్లస్టర్‌లోనే 10వేల ఉద్యోగాలు కల్పించబోతున్నామన్నారు. గన్నవరంలోని మేధాటవర్స్ నిర్మాణం 2010లోనే పూర్తయినప్పటికీ .. అప్పటి ప్రభుత్వం ఒక్క ఐటీ సంస్థను కూడా తీసుకురాలేకపోయిందన్నారు. తాము వచ్చిన తర్వాత మేధాటవర్స్ నిండిపోయి రెండో దశకు శంకుస్థాపన చేశామన్నారు. చిన్న ఐటీ సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నామని, అనుమతులన్నీ శరవేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. తాను కేవలం ఆరు గంటల్లోనే ఫైళ్లను పరిష్కరిస్తున్నానని.. పెట్టుబడులు పెట్టేవారు ముందుకు రావాలని లోకేశ్ కోరారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







