చైనా లో బంపర్ ఆఫర్: సిగరెట్ మానేస్తే అదనపు సెలవులు

- November 25, 2017 , by Maagulf
చైనా లో బంపర్ ఆఫర్: సిగరెట్ మానేస్తే అదనపు సెలవులు

టోక్యో: ఏదైనా కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఆ కంపెనీ సెలవులు పెట్టే ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అవసరమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకొంటుంది. కానీ, జపాన్ దేశంలోని ఓ కంపెనీ మాత్రం ఏకంగా ఆరు పనిదినాలను సెలవు దినాలుగా ఇస్తామని ప్రకటించింది. అయితే ఇందుకు సిగరెట్ మానేయాలని షరతు విధించింది.
కొన్ని కంపెనీలు ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగుల సంక్షేమాన్ని అంతగా పట్టించుకోవు. అయితే జపాన్ కంపెనీ మాత్రం ఉద్యోగుల వ్యక్తిగత అలవాట్లను మాన్పించేందుకు గాను అదనపు సెలవులను షరతు విధించింది.
ఉద్యోగుల సంక్షేమం కోసం జపాన్ కంపెనీ తీసుకొన్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ తరహ ఆఫర్లతో ఉద్యోగుల సంక్షేమం కోసం జపాన్ కంపెనీ తీసుకొన్న నిర్ణయాల పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది.
సిగరెట్ మానేస్తే 6 అదనపు సెలవులు
జపాన్‌కు చెందిన పియాలా ఐఎన్‌సీ కంపెనీ సిగరెట్‌ను మానేసే తమ ఉద్యోగుల కోసం బంప్ ఆఫర్‌ను ప్రకటించింది. ఏడాదికి ఆరు అదనపు సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది. సిగరెట్ మానేస్తే ఉద్యోగుల ఆరోగ్యం కూడ బాగుపడే అవకాశం ఉంటుందని కంపెనీ భావిస్తోంది. అంతేకాదు తమ కంపెనీ కోసం ఉద్యోగులు మరింత ఎక్కువ శ్రద్ద పెట్టి పనిచేసే అవకాశం ఉంటుందని కంపెనీ అధికారులు చెప్పారు.

. టైమ్ వేస్ట్ కాకుండా 
సమయం వృధా కాకుండా...
టోక్యోలో పియాలా ఐఎన్‌సీ కంపెనీ కార్యాలయం 29వ అంతస్తులో ఉంది. కంపెనీ ఉద్యోగులు సిగరెట్ తాగేందుకు భవనం బేస్‌మెంట్‌లోకి వచ్చి వెళ్తుండడంతో 15 నిమిషాల సమయం వేస్టవుతోంది.దీంతో సమయాన్ని ఆదా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ కంపెనీ సిగరెట్ మానేసే ఉద్యోగులకు అదనపు సెలవులు ఇస్తామని కంపెనీ నిర్ణయాన్ని ప్రకటిచింది.

సజేషన్ బాక్స్‌లో సలహ
ఉద్యోగులు విధులు నిర్వహించే సమయంలో సిగరెట్ తాగేందుకు కిందకు రావడంతో సమయం వృధా అవుతోంది. అయితే ఈ సమయంలో సిగరెట్ తాగని వారిపై పనిబారం పడుతోంది. దీంతో సిగరెట్ తాగని ఓ ఉద్యోగి ఈ సలహను సజేషన్‌ బాక్స్‌లో పేపర్‌పై రాసి వేశారు. ఈ కంపెనీ సీఈఓ ఈ నిర్ణయాన్ని అమలుపర్చాలని నిర్ణయం తీసుకొన్నారు.

30 మంది సిగరెట్ మానేశారు
పొగతాగని వారికి ఏడాదికి ఆరు పనిదినాలు సెలవులుగా ఇవ్వాలని సెప్టెంబరు నుండి అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ కంపెనీలో 120 మంది పనిచేస్తున్నారు.
ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత 120 మంది ఉద్యోగుల్లో 30 మంది ఇప్పటికే ధూమపానానికి స్వస్తి చెప్పారు. ఇప్పుడీ కంపెనీ కాన్సెప్ట్‌ను అందిపుచ్చుకునేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com