హైదరాబాద్ పై అమెరికా డేగకన్ను
- November 26, 2017
ఇవాంకా ట్రంప్ భాగ్యనగరంలో అడుగుపెట్టడానికి 48 గంటల కంటే తక్కువ టైముంది. కానీ అగ్రరాజ్యం అధ్యక్షుడి గారాలపట్టి కోసం హైదరాబాద్ మాత్రం ముస్తాబైపోయింది. ఇవాంక అడుగుపెట్టే క్షణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అంతర్జతీయ జీఈఎస్ సదస్సు కంటే, మెట్రో ప్రారంభం కంటే, ప్రధాని మోడీ రాక కంటే ఎక్కువగా ప్రపంచాన్నంతా ఆకర్షిస్తోంది ఇవాంక పర్యటన
ఇవాంక ఇండియాలో ఉన్నంత సేపూ అమెరికా కన్ను మనపైనే ఉంటుంది. ముఖ్యంగా భాగ్యనగరం మీదే ఉంటుంది. ఆమె ట్రంప్ కుమార్తే కాదు.. అమెరికా అధ్యక్షుడి సలహాదారు, ఆ దేశ వ్యాపార వేత్తల ప్రతినిధి కూడా అందుకే ఆమె భద్రతకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు ఆ దేశ అధికారులు. ఐదంచెల రక్షణ వలయంతోపాటూ తిరిగి స్వదేశం చేరుకునేవరకూ సెక్యూరిటీని నిశితంగా పరిశీలించనున్నారు. దీనికోసం స్పెషల్ శాటిలైట్ యూజ్ చేస్తున్నారు. పదకొండేళ్ల క్రితం అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ హైదరాబాద్లో పర్యటించినప్పుడు కూడా సీక్రెట్ సర్వీసెస్ అధికారుుల ఇలాగే ఉపగ్రహం ద్వారా భద్రతను పర్యవేక్షించారు. ప్రస్తుతం ఇంకా అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉండడంతో ఇవాంక ప్రతి కదలికపైనా నిఘా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే 60 మంది అధికారులున్న మూడు అమెరికా అధికారుల బృందాలు హైదరాబాద్లో పనులు ప్రారంభించాయి.
ఇవాంక భద్రతలో ప్రతి అంచె కీలకమే. మొదటి అంచె సెక్యూరిటీ మూడు మీటర్ల దూరంలో ఉంటుంది. ఆమెకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకోడానికి వీరు కీలకం. ఏదైనా జరిగినపుడు అనూహ్యంగా స్పందించే సెక్యూరిటీ గార్డ్స్ పరిస్థితులు తమ చేతుల్లోకి తీసుకుంటారు. వీళ్లు గెరిల్లా యుద్ధంలో నిపుణుులగా ఉంటారు. అత్యాధునిక ఆయుధాలతో ఇవాంకను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఐదు కిలోమీటర్ల దూరంలో మరో సెక్యూరిటీ రింగ్ ఉంటుంది. ఇక్కడకు ఎవరికీ అనుమతి ఉండదు. క్లోజ్ ప్రాక్సిమిటీ టీమ్ అనే ఈ బృందంలో వీరితో పాటు సీపీఆర్ఎఫ్ అధికారులు భద్రతను పర్యవేక్షిస్తారు. వీరి దగ్గర స్నైపర్ లాంటి వెపన్స్ ఉంటాయి. ముప్పై అడుగుల వలయంలో అమెరికా అధ్యక్షుడి కుటుంబానికి సెక్యూరిటీ ఇచ్చే మరో టీమ్ ఉంటుంది. వీళ్లు చుట్టూ గమనిస్తూ అలర్ట్గా ఉంటారు. గుర్తింపు కార్డులు లేందే ఎవరినీ అనుమతించరు
వంద మీటర్ల దూరంలో నాలుగో అంచె సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ 15 మంది ఉన్న సెక్యూరిటీ వింగ్ అప్రమత్తంగా ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో ఉండే వీళ్లు ఆ చుట్టుపక్కల వాహనాల రాకపోకలు, అపరిచుతులపై కన్నేసి ఉంచుతారు. ఏవైనా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే.. వాహనాలు వేగంగా దూసుకొస్తున్నా.. అప్పటికప్పుడే అందరినీ ఆలర్ట్ చేసి పరిస్థితిని కంట్రోల్ చేస్తారు. ఐదో అంచెలో 500 మీటర్ల దూరంలో కూడా అమెరికా అధికారులే ఉంటారు. ఇక్కడినుంచే తమ వ్యూహాన్ని అమలు చేస్తుంటారు.
ఎప్పటికప్పుడు ఇవాంక చుట్టుపక్కల ప్రదేశాలను ఉపగ్రహం ద్వారా కాప్చర్ చేసే సిబ్బంది వాటిని క్షణాల్లో ఇవాంక చుట్టూ ఉన్న అధికారులకు పంపుతారు. వాటిని బట్టి అప్పటికప్పుడే సెక్యూరిటీ అలర్ట్ అవుతుంది. ఎటు వెళ్లాలో, ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేస్తుంది. సెక్యూరిటీ దగ్గర ట్యాబ్స్ కూడా ఉంటాయి. వాటిలో చూస్తూ వారు తమ నెక్ట్స్ స్టెప్ వేస్తుంటారు. ఇప్పుడు ఇవాంక హైదరాబాద్ పర్యటన అమెరికా అధికారులను హై అలర్ట్ చేసింది. ఆమెను తిరిగి సురక్షితంగా అమెరికా చేర్చే బాధ్యతను సమర్థంగా నిర్వహించేలా పరుగులు పెట్టిస్తోంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!