రెండేళ్ళ గరిష్టానికి యూఏఈ ఫ్యూయల్‌ ధరలు

- November 28, 2017 , by Maagulf
రెండేళ్ళ గరిష్టానికి యూఏఈ ఫ్యూయల్‌ ధరలు

యూఏఈ: అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్‌ ఆయిల్‌ ధరల నేపథ్యంలో పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరలు యూఏఈలో 28 ఏళ్ళ గరిష్టానికి చేరుకోనున్నాయి. డిసెంబర్‌లో ఈ ధరలు రికార్డు స్థాయిని చేరుకోనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఎనర్జీ వెల్లడించిన తాజా ధరల ప్రకారం 98 అన్‌లెడెడ్‌ గ్యాసోలిన్‌ 6 శాతం లేదా 12 ఫిల్స్‌ వరకు పెరుగుతాయి. 95 అన్‌లెడెడ్‌ గ్యాసోలన్‌ గత నెలలో 1.92 దిర్హామ్‌లు కాగా, డిసెంబర్‌లో ఈ ధర 2.04 కానుంది. 91 అన్‌లెడెడ్‌ గ్యాసోలైన్‌ 1.85 నుంచి 1.97కి చేరుకోనుంది. డీజిల్‌ ధర 9 ఫిల్స్‌ పెరగనుంది. 2015 ఆగస్ట్‌లో యూఏఈలో అత్యధిక ధరల్ని పెట్రోల్‌, డీజిల్‌ కోసం వాహనదారులు చెల్లించాల్సి వచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com