'ఓ స్త్రీ రేపు రా'ఆడియో వేడుక ఈ నెల 19న
- November 14, 2015
ఆశిష్ గాంధీ, వంశీకష్ణ కొండూరి, కునాల్ కౌశిక్, దీక్షాపంత్, శృతి మోల్, మనాలి రాథోడ్ ప్రధాన పాత్రధారులుగా రీడింగ్ లాంప్ క్రియేషన్స్ బ్యానర్‌పై అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'ఓ స్త్రీ రేపు రా'. 'కల్పితమా..కచ్చితమా' అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం ఆడియో త్వరలో విడుదల కానుంది. ఒకప్పుడు ఊళ్ళో దెయ్యం తిరుగుతుందని, ఇంటి గోడలపై 'ఓ స్త్రీ రేపు రా' అని రాసుకునేవారని దర్శక నిర్మాత అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. కొన్ని చోట్ల భయంతో చాలా మంది తమ గ్రామాలను విడిచి పెట్టి వెళ్ళిపోవడం కూడా జరిగిందని, ఇలాంటి డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో 'ఓ స్త్రీ రేపు రా' చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. జి.వి. సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో వేడుకను సినీ ప్రముఖలు సమక్షంలో ఈ నెల 19న నిర్వహిస్తున్నామని, అలాగే సినిమాను డిసెంబర్ రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







