హెయిల్ కు చేరుకొన్న మొదటి సౌదీ రైల్వే కంపెనీ రైలు
- November 29, 2017
జెడ్డా: మొదటి సౌదీ రైల్వే కంపెనీ రైలు శనివారం హెయిల్ లో ప్రవేశించింది. అల్-మజ్మాహ్ మరియు ఖాసీమ్ గుండా ప్రయాణించిన ఈ రైలు రియాద్ నుండి నాలుగవ స్టాప్ గా హెయిల్ ఉంది. అర్ధ జానపద నృత్యాన్ని సంతోషంగా చేయడం ద్వారా ఈ రైలును స్థానికులు ఘనంగా స్వాగతించారు. ఈ రైలు సేవతో రాజధాని రియాద్ కు కలుపబడే ఒక సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన ఎంపికను హెయిల్ నివాసులను అందిస్తుంది. సౌదీ అరేబియా రైల్వే సేవ ,నిర్వహణ స్థానాల్లో ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది. రియాద్ నుండి హేయిల్ వరకు ప్రయాణం చేయటానికి ప్రారంభ టికెట్ 120 సౌదీ రియల్ (32 డాలర్లు) ధరలు ఉంటాయి,అధికారిక వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకున్నట్లయితే ప్రయాణికుడు 60 సౌదీ రియళ్ల రాయితీని పొందవచ్చు. ప్రయాణికులు ఆదివారాలు, బుధవారాలు ,శుక్రవారాలలో రియాద్-హేల్ రైలులో ప్రయాణించవచ్చు .ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన పలువురు వివిధ సోషల్ మీడియా వేదికలపై సౌదీ రైల్వే కంపెనీ రైలు గూర్చి సానుకూలంగా స్పందిస్తూ, సొగసైన కాబిన్ డిజైన్ , మృదువైన నిర్వహణ పట్ల ప్రశంసించారు. రెడ హన్వార్ అనే మహిళ రైలులో తన అనుభవాన్ని ఒక ట్వీట్లో పేర్కొంటూ, " తాను ఒక కలలోకి అడుగుపెట్టిన అనుభూతి ఉందని ఈ ప్రయాణినికి అంతమే లేదని భవిష్యత్తు మహా అనంతమైనదని ఆమె పేర్కొంది. "
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!