2050 నాటికి మూడింతల ముస్లిం జనాభా
- November 30, 2017
లండన్ : మధ్యప్రాచ్యంలో నెలకొన్న అంతర్గత సంక్షోభాలు.. ఐరాపాను వణికిస్తున్నాయి. 2050 నాటికి ఐరోపా దేశాల్లో ముస్లింల జనాభా మూడింతలు పెరగనుందని అమెరికాకు చెందిన ప్రముఖ సర్వే సంస్థ ప్యూ రిసెర్చ్ సెంటర్ ప్రకటించింది. ప్యూ రీసెర్చ్ ప్రకటించిన తాజా సర్వేతో ఐరోపా దేశాలు.. విలవిల్లాడుతున్నాయి. ముఖ్యంగా ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల నుంచి లక్షల్లో ముస్లింలు ఐరోపాకు శరణార్థులుగా వలస వెళ్లారు. వీరు అక్కడే స్థిరపడ్డంతో.. జనాభా గణనీయంగా పెరుగుతుందని ప్యూ సర్వే ప్రకటించింది.
జర్మనీలో 2016 నాటికి 6.1 శాతం ఉన్న ముస్లిం జనాభా.. 2050 నాటికి 19.7 శాతానికి చేరుకుంటుందని ప్యూ సర్వే ప్రకటించింది. ఐరోపా సమాఖ్యలోని 28 దేశాల్లోనూ ముస్లింల జనాభా ఇదే నిష్పత్తిలో పెరుగుతుందని ప్యూ రీసెర్చ్ అంచనాలు వేస్తోంది. అలాగే మొత్తం ఐరోపా జనాభాలో 2016 నాటికి కేవలం 4.9 శాతం ముస్లింల జనాభా 2050 నాటికి 25.8 మిలియన్లకు చేరుకుంటుందని ప్యూ సంస్థ అంచనా వేస్తోంది.
తాజా వార్తలు
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్